టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం.. శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం

TDP Chief Chandrababu Naidu Held Extensive Meeting Today at Party Central Office Mangalagiri,TDP Chief Chandrababu Naidu,Extensive Meeting Mangalagiri,Party Central Office Mangalagiri,Mango News,Mango News Telugu,Chandrababu Naidu Latest News And Updates,Chandrababu News And Live Updates,Mangalagiri TDP Office,TDP Mangalagiri Office,TDP Office,TDP News And Updates,TDP,Telugu Desham Party,Telugu Desham Party Latest News,Telugu Desham Chief Chandrababu Naidu

టీడీపీ పాలనలో చేపట్టిన సంస్కరణలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని పేర్కొన్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కేడర్‌కు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నామో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతతో ప్రవర్తించామని, రాష్ట్రంలో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండాలనే కోరుకున్నామని తెలిపారు.

అయితే తాను ఎప్పుడూ పదవులను ఒక బాధ్యతగానే భావించానని, రాష్ట్ర శ్రేయస్సు కోసమే పనిచేశానని, ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వంటి వారి నుంచి ప్రశంసలు అందుకున్నానని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పటివరకు ఎందరో ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను చూశానని, కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లాగా కక్షపూరితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. కావాలనే టీడీపీ నేతలను అరెస్టులు చేయిస్తున్నారని, దాడులు చేస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను గట్టిగా నిలదీశామని, దీనిద్వారా ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత బయటపడిందని తెలిపారు. అందుకే నిన్న తన కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించారని, అయితే వెనక్కు తగ్గేది లేదని, ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని నేతలను, కార్యకర్తలను కోరారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కేడర్ పనిచేయాలని, టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేవరకూ విశ్రమించొద్దని నాయకులకు చంద్రబాబు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 20 =