ఏపీలో నైట్ కర్ఫ్యూ – ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

AP Night curfew, night curfew in ap,Andhra Pradesh Government Imposes Night Curfew From 11 Pm To 5 Am, Night Curfew From 11 Pm To 5 Am, Andhra Pradesh Government, AP Government, Night Curfew, Curfew From 11 Pm To 5 Am, AP Latest News, AP Live Updates, CM YS Jagan Mohan Reddy, AP night curfew, Night Curfew Latest News, Night Curfew Latest Updates, Night Curfew In Andhra Pradesh, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. దీనికి సంబంధించి త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని.. అలాగే, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై కీలక అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని అధికారులు వివరించారు. కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు: నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. 104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలి. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలి. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలి. మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలి. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కరోనా ఆంక్షలు పాటించేలా చూడాలి. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలి. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలి. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలి. కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =