తమ అవకాశాన్ని వదులుకోని ఉద్యోగ, ఉపాధ్యాయులు

AP Elections 2024,A Huge response to the postal ballot, teachers,employees,postal ballot
AP Elections 2024,A Huge response to the postal ballot, teachers,employees,postal ballot

ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగగనుండటంతో ఎక్కడ చూసినా అదే చర్చ  సాగుతోంది. పోలింగ్ కంటే ముందే జరుగుతున్న హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వంటి వాటితో ఏపీ పోలింగ్ వాతావరణం హీటెక్కుతోంది.  హోం ఓటింగ్ లో 80 ఏళ్లు పైబడిన వారితో పాటు, 40శాతానికి పైగా అంగవైకల్యంతో బాధపడే దివ్యాంగులు పాల్గొనగా.. పోస్టల్ బ్యాలెట్ లో పోలింగ్ విధుల నిర్వహణలో భాగం పంచుకునే ఉద్యోగులు పాల్గొంటారు. హోం ఓటింగ్ కు అనుకున్నంత స్పందన రాలేదన్న ఎన్నికల అధికారులు .. పోస్టల్ బ్యాలెట్‌కు మాత్రం విశేష స్పందన వస్తుందని అంటున్నారు.

ఎందుకంటే.. ఐదేళ్ల వైసీపీ పాలనపై   ఉద్యోగులు,  ఉపాధ్యాయులు  పూర్తిగా విసిగిపోయారు. రద్దు చేస్తామన్న సీపీఎస్ సంగతిని జగన్ మర్చిపోయారు. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలను  కూడా తగ్గించేశారు.అంతేకాదు ఫస్ట్ తారీఖను జీతాలు అందే రోజు అన్న నమ్మకాన్ని కూడా చెరిపేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం పై ఉద్యోగులు,  ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని చాలా సందర్భాల్లో హెచ్చరించారు.ఇప్పుడు అందుకే గతంలో  ఎన్నడూ లేని విధంగా తొలిరోజు బ్యాలెట్ ఓటు వేయడానికి  ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కదిలివచ్చారు.

సాధారణంగా ఇప్పటి వరకూ జరిగిన  ప్రతి ఎన్నికల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన  దరఖాస్తులు లక్షన్నర వరకూ  వచ్చేవి. ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉండటంతో  కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలా అని ఆలోచించి  ఎక్కువమంది ఓటు వేసేవారు కాదు. కానీ ఈసారి  రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం ఈసీ అధికారులునే షాక్ గురయ్యేలా చేస్తోంది.

నిజానికి ఈ  పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినా.. వాటన్నింటిని అధిగమించి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ లను పొంది.. నిన్నటి నుంచి ఓటు వేయడం ప్రారంభించారు. దీనిలో 90శాతం మంది వైసీపీ వ్యతిరేక ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. చాలామంది తమ ఓటు  విషయాన్ని బాహటంగానే చెప్పుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఏ ఉద్యోగ, ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులను పరిశీలించినా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్న చర్చలే కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీపై తమ కడుపు మంట తీర్చుకోవడానికి పెద్ద ఎత్తును తరలిరావడంతోనే ఇంత పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ శాతం పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY