టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.3096 కోట్లతో వార్షిక బడ్జెట్‌ ఆమోదం

2022-23 Annual Budget Approved with Rs 3096 Cr, Andhra Pradesh, Mango News, Tirumala Tirupati Devasthanam, tirumala tirupati devasthanam revenue, TTD, TTD approves budget for 2022-23, TTD approves Rs 3096 crore budget for 2022-23, TTD Board Approves annual budget, TTD Board approves Rs 3096 cr budget for financial year, TTD Board Meeting, TTD Board Meeting 2022-23 Annual Budget Approved with Rs 3096 Cr, TTD board nods Rs 3096 cr budget for 2022-23, TTD Trust Board

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 17, గురువారం నాడు తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ వార్షిక బడ్జెట్ సహా పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.

టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు:

  • 2022-23 సంవత్సరానికి రూ.3096 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ ఆమోదం.
  • ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించాలని, ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంచాలని నిర్ణయం
  • ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటన
  • సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవం టికెట్ల ధర పెంపుపై చర్చ
  • మహాద్వారం, ఆనంద నిలయానికి, బంగారు వాకిలికి బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయం
  • రూ.230 కోట్లతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం
  • రూ.2.73 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునికరణ
  • అలిపిరి వద్ద 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక సిటీ నిర్మాణం
  • తిరుమలలో కోనుగోలు చేసి తినే అవసరం లేకుండా భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించేలా ప్రణాళికలు. ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ తొలగించి భక్తులకు భోజనం అందించడం, ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికి ఒకే రకమైన భోజనం అందించేలా చర్యలు.
  • అన్న ప్రసాదం భవనంలో భోజనం తయారికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు
  • టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలకు రూ.25 కోట్లు
  • వీలైనంత త్వరగా అన్నమయ్య మార్గం ఏర్పాటు
  • నాదనీరాజనం వద్ద శాశ్వత ప్రతిపాదిక మండపం నిర్మాణం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =