ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొత్తానికి ఆదర్శనీయంగా నిలిచేలా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్న చికిత్సలకు ప్రైవేటు బీమా సంస్థల కన్నా మంచి రేట్లు చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నవారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే ఆస్పత్రుల్లో చేరుతున్న కొవిడ్ బాధితుల్లో అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలన్నారు. కరోనా పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్యశ్రీని విప్లవాత్మక పథకంగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ అమలు తీరు దేశం మొత్తం చర్చించుకునేలా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో జీఎంపీ ప్రమాణాలున్న మందులనే ఇస్తున్నామని చెప్పారు. కనీసం 10 రోజులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఆరోగ్యశ్రీ అమలు తీరుపై ఆరా తీయాలని ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్‌చంద్‌ను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 93 శాతం మంది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ