ఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సెప్టెంబర్ 15, మంగళవారం నాడు కేసు నమోదు చేసింది. అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో వచ్చిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఏసీబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనుంది. ఇప్పటికే సిట్ అధికారులు రాష్ట్రప్రభుత్వానికి సమర్పించిన నివేధిక ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గతంలోనే రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం కూడా తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu