రైల్‌ నిలయంలో 30 మందికి కరోనా పాజిటివ్, 2 రోజుల పాటు మూసివేత

30 Employees Test Positive In Secunderabad Rail Nilayam, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Covid-19 Updates in Telangana, Secunderabad Coronavirus, Secunderabad Coronavirus News, Secunderabad Rail Nilayam, Secunderabad Rail Nilayam Closed for 2 Days

సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క జోనల్ ప్రధాన కార్యాలయమైన రైల్ నిలయంలో 30 మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారినపడ్డారు. రైల్‌ నిలయంలో పలు విభాగాల్లో విధులు నిర్వహించే 2000 కు పైగా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 30 మందికి కరోనా పాజిటివ్‌ తేలినట్టు పేర్కొన్నారు. దీంతో రైల్ నిలయాన్ని రెండ్రోజుల పాటుగా మూసివేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 14 మరియు 15 తేదీల్లో భవనంలో శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శానిటైజేషన్ పక్రియ ముగిసాక, బుధవారం నుంచి మళ్ళీ రైల్ నిలయంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అదే విధంగా ఇంకా పరీక్షలు చేయించుకోని సిబ్బందిని, త్వరగా పరీక్షలు చేయించుకుని ఫలితాలకు అనుగుణంగా నిబంధనలు పాటించాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =