జగన్ పార్టీ పెట్టాక టీడీపీ జీరో..ఇప్పుడు వైసీపీ ఖాళీ

Ys Jagan,YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Congress, CM Jagan,Nellore, Anil Kumar Yadhav,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,AP Political News
Ys Jagan,YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Congress, CM Jagan,Nellore, Anil Kumar Yadhav

వైసీపీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీకి తిరుగులేదన్న గుర్తింపును బాగా తెచ్చుకుంది. టీడీపీ  ఒక్కసీటు అయినా గెలవడానికి అష్టకష్టాలు పడేది. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో అక్కడ సీన్ మారి..వైసీపీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి బలమైన నేతలతో పాటు సీనియర్లు కూడా  ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. జగన్ పార్టీ పెట్టాక ఈ జిల్లాలో  కోవూరు ఉప ఎన్నిక జరగగా.. అప్పుడు వైసీపీ నుంచి బరిలో దిగిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోమిరెడ్డిపై ఘన విజయాన్ని సాధించారు.

2012లో జరిగిన 18 సీట్ల బై ఎలక్షన్స్ సమయంలో కూడా నెల్లూరు పార్లమెంటు సీటును ఏకంగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో  వైసీపీ గెలిచింది. 2014లో  జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నెల్లూరు జడ్పీ పీఠంతో పాటు నెల్లూరు మేయర్ పీఠాన్ని వైసీపీనే గెలుచుకుంది.అప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోయినా 10 అసెంబ్లీ సీట్లకు 7 సీట్లను గెలవడమే కాకుండా..నెల్లూరు ఎంపీ సీటును దక్కించుకుంది.  2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 10కు 10 అసెంబ్లీ సీట్లను గెలిచి.. నెల్లూరు పార్లమెంటు సీటును కూడా దక్కించుకుని నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసింది.

దీంతో నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట అన్న ముద్ర  పడిపోయింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీ కోటలు  బద్దలవుతున్నాయి.  పార్టీకి బలంగా ఇన్నాళ్లూ ఉన్న బలమైన నేతలంతా ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. అసలు వైఎస్సార్సీపీ నుంచి ఎప్పుడు, ఏ నేత బయటకు వస్తారో కూడా అర్తం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీకి  దూరమయ్యారు. వీరి లిస్టులోకే తాజాగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా  చేరిపోయారు.

నెల్లూరు సిటీలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను..సర్వేల లెక్కలతో  గుంటూరు జిల్లా నరసారావుపేట పార్లమెంట్ స్థానానికి  బదిలీ చేశారు.  నెల్లూరు జిల్లాలోకి వచ్చిన కందుకూరులో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా పార్టీని వీడతారని తెలుస్తోంది. అంతేకాదు జిల్లా నుంచి మరికొంతమంది నేతలు కూడా పార్టీని ఏదొక పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  ఇలా వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి కంచుకోటగా ఉన్న నెల్లూరులో.. ఇప్పుడు ఆ జగన్ కోట పూర్తిగా కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY