ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాగా గత కేబినెట్ సమావేశం ఆగస్టు 19 న జరగగా, వైఎస్ఆర్ ఆసరా పథకం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్ఆర్ విద్యాకానుక పథకం, ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభాలపై చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే నూతన పారిశ్రామిక విధానం, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu