ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై తప్పుగా ప్రచారం చేయొద్దు

Singer SP Balasubrahmanyam, SP Balasubrahmanyam, SP Balasubrahmanyam coronavirus, SP Balasubrahmanyam Health, SP Balasubrahmanyam Health Details, SP Balasubrahmanyam Health News, SP Balasubrahmanyam Health Updates, SP Charan

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌ గా వచ్చిందని వచ్చిన వార్తలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి వైద్య బృందాన్ని సంప్రదించాక, ఎప్పటికప్పుడు ఆ హెల్త్‌ అప్‌డేట్‌లను తానే అందిస్తానని, ఏ విషయమైనా తన ద్వారానే తెలుస్తుందని ఎస్పీ చరణ్ అన్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కోవిడ్‌ నెగటివ్‌ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా నెగటివ్ లేదా పాజిటివ్ అనే విషయం పక్కన పెడితే, ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని చరణ్ అన్నారు. వెంటిలేటర్‌, ఎక్మోసాయంతోనే వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై దయచేసి ఎలాంటి అసత్య ప్రచారాలను చేయొద్దని ఎస్పీ చరణ్ కోరారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =