ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం, ఇకపై వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ

AP Governor Bishwabushan Harichandan Approved Dr NTR University of Health Sciences Amendment Act 2022, AP Governor Bishwabushan Harichandan, Approved Dr NTR University Amendment Act 2022, NTR University To YSR Varsity, NTR Health University, Dr YSR Varsity , AP Govt Amendment Bill , AP Govt To Introduce Amendment in Assembly Today, NTR Health University To Dr YSR Varsity, Mango News, Mango News Telugu, AP Former CM YS Rajashekar Reddy, Former CM Nandamuri Taraka Rama Rao, YSR Congress Party, Telugu Desham Party, AP Assembly Sessions, YSRTP

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గత అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు-2022కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్ట సవరణ చేసి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు సోమవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్​ జారీ చేసింది. 2022, అక్టోబరు 31వ తేదీ నుంచే చట్టంలో పేర్కొన్న నియమాలు అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఇకపై వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారిపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =