ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే అమరావతి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి అధికారులతో సమీక్ష నిర్వమించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖా మంత్రి మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా.. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిపై ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
మరోవైపు అమరావతిని అభివృద్ధి చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడు పెంచారు. ప్రపంచంలో నాలుగో రాజధాని ఆంధ్రప్రదేశ్‌కు ఉండాలని ఇప్పటికే చంద్రబాబు కోరుకున్నారు. దీనికోసమే ఇప్పుడు ముఖ్య మంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనికి ఊతమిచ్చినట్లుగానే చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే అమరావతిలో అడుగు పెట్టి మరీ.. రాజధాని అమరావతేననే నమ్మకాన్ని కలిగించారు.
ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు.. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటామని పదే పదే చెప్పుకొచ్చారు. అలాగే అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే..తామేం చేయాలని అనుకుంటున్నామో వివరిస్తున్నారు.
దీనిలో భాగంగానే అమరావతి వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి చంద్రబాబు సన్నాహాలు చేశారు. ఈ మేరకు బుధవారం అంటే జులై 3న శ్వేతపత్రం విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతి రాజధానిపై కూడా శ్వేతపత్రం విడుదల చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరోసారి షాక్ ఇవ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY