కాపు ఓట్లపై వైసీపీ ఫోకస్.. వివి వినాయక్ కోసం ప్రయత్నాలు

YCP Focus on Kapu Votes Efforts for Vivi Vinayak, YCP Focus on Kapu Votes, Vivi Vinayak Kapu Votes, Focus on Kapu Votes, VV Vinayak, YCP, CM Jagan, AP Assembly Elections, Latest YCP Focus on Kapu Votes News, YCP Kapu Votes Focus News, Kapu Votes, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YCP Focus on Kapu Votes Efforts for Vivi Vinayak, YCP Focus on Kapu Votes, Vivi Vinayak Kapu Votes, Focus on Kapu Votes, VV Vinayak, YCP, CM Jagan, AP Assembly Elections, Latest YCP Focus on Kapu Votes News, YCP Kapu Votes Focus News, Kapu Votes, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu

ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలని పరితపిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. 2019 ఎన్నికల్లో 152 స్థానాలు గెలుచుకున్న జగన్.. ఈసారి 175కు 175 స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు. అయితే అటు వైసీపీ సర్కార్‌ను గద్దె దించేందుక టీడీపీ, జనసేన పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయిదేళ్లుగా అధికారానికి దూరంగా తెలుగు దేశం పార్టీ ఈసారి ఎలాగైనా గెలుపొందాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

వైసీపీ సర్కార్‌ను గద్దె దించేందుకు ఈసారి తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీ కూడా టీడీపీ, జనసేన పొత్తుకు జై కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఏపీలో ఎక్కువగా ఉన్న కాపు సామాజికవర్గ ఓట్లన్నీ కూటమివైపు వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా కాపు ఓట్లను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో అప్రమత్తమైన జగన్.. కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టారు. కాపు ఓట్లను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఈక్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందిన దిగ్గజ దర్శకుడు వివి వినాయక్‌ను రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోందట. అయితే పోయిన ఎన్నికల సమయంలోనే వినాయక్ వైసీపీలో చేరుతారని వార్తలొచ్చాయి. జగన్ నిడదవోలు టికెట్ వినాయక్‌కు కేటాయించనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అదే సమయంలో రెండు, మూడుసార్లు వినాయక్.. వైసీపీకి, జగన్‌కు అనుకూలంగా మాట్లాడడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఇక వినాయక్ వైసీపీలో చేరడం ఖాయమని అంతా భావించారు. కానీ చివరికి అది జరగలేదు.

అయితే త్వరలో జరగబోయే ఎన్నికల ముంగిట వివి వినాయక్‌ను పార్టీలోకి తీసుకురావడానికి జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే వైసీపీ నేతలు వినాయక్‌కు టచ్‌లోకి వెళ్లారట. రాజమండ్రి లేదా ఏలూరు ఎంపీ టికెట్‌ను వినాయక్‌కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి జగన్ ఆఫర్‌ను వివి వినాయక్ స్వీకరిస్తారా..? వైసీపీలో చేరుతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే అంతకంటే ముందు కాపు సామాజిక వర్గంపై ఫోకస్ చేసిన జగన్.. ఆ వర్గానికి చెందిన వారిని పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు మొదలు పెట్టారు. కాపు సామాజిక వర్గానికి చెందిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడిని పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే అదే సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరడం ఖాయమయిపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 3 =