వరద ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు రూ. 2 వేలు సాయం, సీఎం జగన్ ఏరియల్ సర్వే

Andhra Pradesh, Andhra Pradesh Floods, Andhra Pradesh News, Andhra Pradesh Rains, AP CM YS Jagan, AP News, Flood Situation in Godavari Districts, Godavari, YS Jagan Video Conference, YS Jagan Video Conference over Flood Situation, YS Jagan Video Conference over Flood Situation in Godavari Districts

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ఆగస్టు 18, మంగళవారం నాడు గోదావరి వరద పరిస్థితిపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను పూర్తి వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. వరద ప్రాంతాల్లో ముంపు బాధిత కుటుంబాలకు రూ. 2 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించి అండగా నిలవాలని సూచించారు. వరద సహాయక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని చెప్పారు.

వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లోగా పంట నష్టం వివరాలు సేకరించి, ఎన్యుమరేషన్‌ పక్రియ కూడా 10 రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం గోదావరి జిల్లాలలో వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే కు చేసేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సీఎం కీలక సూచనలు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu