చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి, సీఎం వైఎస్ జగన్ ట్వీట్

AP CM YS Jagan Wishes TDP Chief Chandrababu a Speedy Recovery, AP CM YS Jagan Wishes TDP Chief Chandrababu a Speedy Recovery from Covid-19, AP Coronavirus, AP Coronavirus News, AP Department of Health, COVID-19, Mango News, Nara Chandrababu, Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu Health Condition, Nara Chandrababu Naidu Health Live Updates, Nara Chandrababu Test Positive For Covid-19, Nara Chandrababu Tests COVID-19 Positive, TDP President, TDP President Nara Chandrababu, TDP President Nara Chandrababu Tests Corona Positive, TDP President Nara Chandrababu Tests COVID-19 Positive, Telugu Desam Party, YS Jagan Wishes TDP Chief Chandrababu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ముందుగా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు మంగళవారం ఉదయం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు, టీడీపీ నాయకులు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =