ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై కీలక సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్ష జరిపారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సి న పనులపైనా అధికారులతో చర్చించి, ప్రాజెక్టుల వారీగా లక్ష్యా లు నిర్దేశించారు. అనుకున్న గడువులోగా ప్రాజెక్టులను పూర్తిచేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పోలవరంలో దిగువ కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం లకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జులై 31 కల్లా పని పూర్తవుతుందని అధికారులు తెలుపగా, ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని సీఎం అన్నారు. వీలైనంత త్వరగా డిజైన్లు తెప్పించుకోవాలని, వెంటపడి మరీపనులు చేయించుకోవాలన్న సీఎం సూచించారు.
ఆర్ అండ్ ఆర్ పై కూడా ప్రత్యేక దృష్టిపెట్టామని, ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత కింద తరలించాలనుకున్న వారిని ఆగస్టుకల్లా తరలించేలా తగినచర్యలు తీసుకుంటున్నామని, మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించామని అధికారులు తెలిపారు. 3228 మంది ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9756 మందిని తరలించాలని అధికారులు తెలుపగా, వీరిని త్వరగా పునరావాసం కల్పించాలని డీబీటీపద్ధతుల్లో ఆర్ అండ్ ఆర్ కింద ప్యా కేజీలు చెల్లించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు నెల్లూరు బ్యా రేజీ, సంగం బ్యా రేజీ, అవుకు టన్నెల్–2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యు లేటర్ వర్క్స్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1 నుంచి నీటి విడుదల, ఇదే ప్రాజెక్టులో టన్నెల్–2 పనులు, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్–2లో ఫేజ్–2 పనులపైనా కూడా సీఎం వైఎస్ సమీక్ష జరిపారు. నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తిచేసి మే15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నామని, సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని, మే 15 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తామని అధికారులు తెలిపారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫైచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వెలగొండ ప్రాజెక్టు కింద ఉదయగిరి, బద్వేలు ప్రాంతాలకు నీటిని అందించడానికి టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. అలాగే తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారరామ తీర్థసాగర్, మహేంద్రతనయ ఆఫ్షోర్ వంటి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ