ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం.. త్వరలో బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం

APSRTC Plans To Introduce Digital Payment System in The Buses Very Soon, APSRTC is gearing up for digital transactions to minimise the cash problems in the buses, Unified Ticketing System, APSRTC introduces online payment for cargo services, APSRTC has introduced digital payment in its cargo, APSRTC to implement UTS, Andhra Pradesh State Road Transport Corporation, Andhra Pradesh State Road Transport Corporation Plans To Introduce Digital Payment System in The Buses Very Soon, Digital Payment System in The Buses, UTS, APSRTC, Digital Payment System, Buses, cargo services, Mango News, Mango News Telugu,

ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఏపీఎస్‌ఆర్టీసీ కూడా తన పంథాను మార్చుకుంటోంది. ఇకపై బస్సులో ప్రయాణీకులు టికెట్స్ కొనుగోలుకు నగదు బదులు డిజిటల్‌ చెల్లింపులు చేసేలా వినూత్న నిర్ణయం తీసుకుంది. అలాగే బస్సుల్లో ఎదుర్కొంటున్న నగదు సమస్యల పరిష్కారానికి డిజిటల్ లావాదేవీలకు సిద్ధమవుతోంది. ఫలితంగా బస్సుల్లో చిల్లర సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయటానికి సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఉపయోగించే టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషీన్స్ (టిమ్స్‌) స్థానంలో సరికొత్త ఈ–పోస్‌ మెషీన్లను అందుబాటులోకి తీసుకురానుంది.

దీనికి సంబంధించి యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌) అనే సాంకేతికతతో కూడిన ఈ–పోస్‌ యంత్రాల సరఫరాకు ‘ఇక్సిగో–అభిబస్‌’ సంస్థతో ఏపీఎస్‌ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అమలులోకి వస్తే ఇకపై ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా టికెట్లు పొందొచ్చు. అలాగే ఈ–పోస్‌ మెషీన్ల ద్వారా సాధారణ టికెట్లతో పాటు సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, జర్నలిస్టులు తదితరులు ఎప్పటిలాగా రాయితీ టికెట్లు పొందే వెసులుబాటును కల్పిస్తున్నారు. అయితే దీనిని ప్రయోగాత్మకంగా పైలట్‌ ప్రాజెక్టు కింద రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు.

అయితే దీనిని ప్రయోగాత్మకంగా పైలట్‌ ప్రాజెక్టు కింద రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంత సర్వీసుల్లో ఈ–పోస్‌ మెషీన్ల వినియోగానికి ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్‌ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఇలా అన్ని డిపోల్లో, బస్టాపుల్లో టిక్కెట్లు ఇచ్చే గ్రౌండ్‌ బుకింగ్‌ స్టాఫ్‌కు కూడా ఈ–పోస్‌ యంత్రాలను అందించనున్నారు. అనంతరం దశలవారీగా ఈ విధానాన్నే రాష్ట్రమంతటా కొనసాగించటానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eleven =