ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. అనంతరం అంతర్వేది ఆలయ నూతన రథాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
అంతర్వేదిలో సుమారు కోటి రూపాయల వ్యయంతో 41 అడుగుల ఎత్తైన నూతన రథాన్ని రాష్ట్రప్రభుత్వం చేయించింది. ఏడు అంతస్తులతో కూడిన ఈ నూతన రథాన్ని 3 నెలల కాలంలోనే అత్యుత్తమంగా నిర్మించారు. శుక్రవారం నుంచి స్వామి కల్యాణోత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి 28 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా సిద్ధం చేసిన రథాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబు, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ