పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో తీయడంపై ఎస్ఈసీ ఆదేశాలు

Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP High Court, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Political Updates, AP SEC, AP SEC Issued Orders over Votes Counting Videography, AP SEC Nimmagadda Ramesh, Nimmagadda Ramesh, Panchayat polls

ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపు పక్రియను వీడియో తీయాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో లెక్కింపు సమయంలో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు అప్పుడు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, అలాగే జనరేటర్లు, ఇన్ వర్టర్లు సహా అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రీ కౌంటింగ్ కు అభ్యర్ధనలు వస్తే కేవలం 10 ఓట్లు తేడా ఉన్నచోటనే అనుమతించాలని చెప్పారు. లెక్కింపు పక్రియను చిత్రీకరించిన వీడియోలను భద్రపరచాలని, కౌటింగ్ పై ఫిర్యాదులు వస్తే అవే కీలకంగా మారనున్నాయని తెలిపారు. ఇటీవలే పంచాయతీలో ఏ ఒక్క ఓటరు కోరినా కూడా ఓట్ల లెక్కింపు పక్రియను వీడియో తీయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీడియోగ్రఫికి సంబంధించి ఎస్ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓట్ల లెక్కింపు వీడియో తీయడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 14 =