ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “వైఎస్ఆర్ ఆసరా” పథకం రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో విడత వైఎస్ఆర్ ఆసరా కింద రాష్ట్రవ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళలకు లబ్ది జరగనుంది. ముందుగా గత ఏడాది సెప్టెంబర్ 11న రాష్ట్రంలో మహిళల సంక్షేమం, సాధికారతే ధ్యేయంగా వైఎస్ఆర్ ఆసరా పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పేరుమీద బ్యాంకుల్లో ఉన్నరుణాన్ని నాలుగు విడతలగా నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లోనే ఈ పథకం ద్వారా ప్రభుత్వం జమ చేయనుంది. అందులో భాగంగా గత సంవత్సరం తొలి విడతగా రూ.6,319.20 కోట్లను జమ చేయగా, నేడు రెండో విడత కింద రూ.6,439.52 కోట్లను జమ చేసే పక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 18 వరకు వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ తేదీల్లో స్వయం సహాయక సంఘాల్లోని మహిళ లబ్ధిదారుల ఖాతాల్లో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత సాయం జమ అవుతుందని తెలిపారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళల సంక్షేమానికి, వారికీ లబ్ది కలిగించేలా ప్రవేశపెట్టిన పథకాల గురించి సీఎం వైఎస్ జగన్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ