తెలంగాణలో కమలం చక్రం తిప్పేనా?

The BJP Plays A Major Role In Telangana State : BJP, BJP Updates, Lok Sabha Politics, Mango News, Mango News Telugu, PM Modi Telangana Tour, PM Modi Telangana Tour Dates, PM Modi Telangana Tour Dates Finalised, Prime Minister Modi Telangana Tour, Prime Minister Telangana Tour, Telangana election, Telangana Politics, Telangana State, TS BJP, TS Politics
telangana state , BJP to play a main role in Telangana state

దక్షిణాధి రాష్ట్రాల్లో కూడా చక్రం తిప్పాలని భావిస్తున్న కమలం పార్టీ.. అందుకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నించింది. మోదీ నుంచి షా వరకూ అగ్రనేతలు ఎందరో రాష్ట్రంలో పలుమార్లు ప్రచారానికి వచ్చారు. గతం కంటే సీట్లను అయితే పెంచుకుంది కానీ.. ఆశించిన స్థానాలను రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెలంగాణపై ఫోకస్‌ పెట్టింది. దేశంలో మోదీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే ఆదునుగా ఇక్కడ పాగా వేయాలని భావిస్తోంది. ఎన్నికల పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది.

తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఆయా సభలు, రోడ్డు షోల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం తరలిరానుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ప్రచారం కూడా జోరందుకుంది. ఆయా కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. మలిదశలో భాగంగా ప్రతి మూడు లేదా నాలుగు రోజులకు ఒక భారీ సభ నిర్వహించి సత్తా చాటాలని పార్టీ నిర్ణయించింది. ఈ సభలకు బీజేపీ అగ్ర నేతలు హాజరయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు మోదీ, అమిత్‌షా పర్యటన షెడ్యూలు ఇప్పటికే ఖరారు కాగా, నడ్డాతోపాటు సీనియర్‌ నేతలు నితిన్‌ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యటనలు ఒకటి, రెండు రోజుల్లో ఖరారు కానుంది.

రాష్ట్రంలో ప్రధాని మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 30న ప్రధాని జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆంధోల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం, శేరిలింగంపల్లి పరిధిలోని ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మే 3న వరంగల్‌ పార్లమెంటు పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అలాగే, నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల కోసం సంయుక్తంగా నిర్వహించే మరో సభకూ హాజరవుతారు. 4న నారాయణపేట, వికారాబాద్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం సిద్దిపేటకు రానున్నారు. మెదక్‌ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. కొన్ని రోజుల కిందట మల్కాజ్‌గిరి పరిధిలో ప్రధాని మోదీ భారీ రోడ్డు షో నిర్వహిం,ఆనేజ ఇలాంటి రోడ్డు షో మరొకటి నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించగా.. జాతీయ నాయకత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =