ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం నాడు పులివెందులలో రూ.5 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు, పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టిన కొత్త బీటీ రోడ్లకు సీఎం శంకుస్థాపన నిర్వహించారు. గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు, గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీం, ఏపీ క్లార్ భవన నిర్మాణం, అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్కు, 4 మోడల్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.
ముందుగా గురువారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎంతో పాటు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంఎల్సీ జకియా ఖానం, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ