ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు ఉదయం కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సోమవారం నాడే అమిత్‌షాతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో పోలింగ్ నేపథ్యంలో సమావేశాన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎలు), పోలవరం రివర్స్ టెండరింగ్, నిర్మాణం వంటి అంశాలపై కూడ వారు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అమిత్‌షాతో భేటీ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో, మధ్యాహ్నం 3 గంటలకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణంరాజు, మిథున్‌రెడ్డి, మర్గాని భరత్, నందిగం సురేశ్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడ ఈ భేటీలో పాల్గొన్నారు.
[subscribe]



