మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన

Chandrababus Visit To Kuppam For Three Days, Chandrababu Visit To Kuppam, Kuppam Visit Chandrababu, Kuppam, Chandrababu Naidu, TDP, CM Jagan, YCP, AP Assembly Elections, Latest Kuppam News, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Chandrababu naidu, TDP, CM Jagan, YCP, AP Assembly elections

రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు కదులుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి ముందుకు అడుగులేస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. అయితే రెండోసారి అధికారంలోకి రావడమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ దిగ్గజ నేతలను కూడా ఓడించాలని జగన్ లక్ష్యంగా పెట్టుకొని వ్యూహాలు రచిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అయితే అటు చంద్రబాబు నాయుడు.. తనను ఓడించేందుకు జగన్ వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. వైసీపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతూ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించారు. ఎప్పుడూ లేనిది ఈ ఏడాది ఎనిమిది సార్లు కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. పలుమార్లు అక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

అయితే ఇప్పుడు మరోసారి కుప్పంలో పర్యటించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఈనెల 8వ తేదీ నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో.. సొంత నియోజకవర్గంలో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు 28, 29, 30 తేదీల్లో కుప్పంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు.

కుప్పం పర్యటనలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో జనసేన కార్యకర్తలతో కలిసి వెళ్లాలని కార్యకర్తలకు సూచించనున్నారు. వైసీపీ ఎత్తుగడలకు ఏమాత్రం తలొగ్గకుండా కేడర్‌ను చంద్రబాబు సంసిద్ధం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + one =