ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ ముగిసింది. ఏపీ సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఈ భేటీలో మొత్తం 57 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు రూ.1. 26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆమోదముద్ర వేశారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పలు పథకాలకు అవసరమైన నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఇక ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు ధీటుగా ప్రతిస్పందించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు.
ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసిన కొన్ని కీలక అంశాలు..
- గ్రీన్ ఎనర్జీ లో రూ. 81 వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం.
- అలాగే 21 వేల ఉద్యోగాలు కల్పించే పలు ప్రాజెక్టులకు ఆమోదం.
- దివ్యాంగులకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో 4% రిజర్వేషన్లుకు అంగీకారం.
- 45-60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థికసాయం కోసం వైఎస్సార్ చేయూత పథకం అమలుకు ఆమోదం.
- ఈనెల 22న ప్రారంభించనున్న ఈ పథకం అమలుకు అవసరమైన రూ.4,700 కోట్లు నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్.
- జల్ జీవన్ మిషన్ అమలుకు రూ.4,020 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం.
- భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్ ఆమోదం.
- ఒబెరాయ్ గ్రూప్‌కు స్టార్ హోటల్ నిర్మాణానికి 30.32 ఎకరాలు కేటాయింపుకి ఆమోదం.
- ఒక్కో గ్రామ సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు.
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ర్యాటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్.
- గ్రేటర్ విశాఖ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం.
- సచివాలయంలో 85 మంది అదనపు పోస్టులు నియామకానికి అనుమతి.
- సీఆర్డీఏ అభివృద్ధికి ప్రభుత్వం తరపున బ్యాంకు గ్యారంటీగా రూ.1600 కోట్ల రుణానికి అనుమతి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ