టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా

Galla Aruna Kumari, Galla Aruna Kumari Resign, Galla Aruna Kumari Resigns, Galla Aruna Kumari Resigns to TDP Politburo Post, Galla Aruna Kumari tenders resignation, Galla Aruna Quits TDP Politburo, TDP leader Galla Aruna Kumari, TDP leader Galla Aruna Kumari resigns, TDP Politburo Post

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలి పదవికి సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన లేఖను గురువారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీలో ‌ఉన్న గల్లా అరుణకుమారి 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆమె ఓడిపోయారు. ఈ నేపథ్యంలో 2018 లో గల్లా అరుణకుమారిని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా చంద్రబాబు నియమించారు. ఇటీవలే కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ వీడుతున్న నేపథ్యంలో గల్లా అరుణకుమారి కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here