శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్రాణవాయువు (ఆక్సిజన్ ) కొరతతో వేలమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా మూడో వేవ్ ముంచెత్తుతోంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కూడా ఆక్సిజన్‌ ప్లాంట్స్ నెలకొల్పే విషయంలో ముందుంటోంది. ఈ క్రమంలోనే, శ్రీ సిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్‌ ఎండీ గజనన్‌ నబర్, కమర్షియల్‌ హెడ్‌ శరద్‌ మధోక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 14 నెలల్లోప్లాంట్‌ ప్రారంభం కావడం ఒక మైలురాయి అని కొనియాడారు. 220 టన్నుల ఆక్సిజన్‌ తయారీ చేయడం చాలా ముఖ్యమైన విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 144 పీఎస్‌ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో పెట్టామని, మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ