అప్పుడే సింగిల్ ప్లేయర్‌గా ఉంటారని భారతిపై ఫైర్

YS Sharmila Sensational Comments On YS Bharathi, YS Sharmila Sensational Comments, YS Sharmila On YS Bharathi, Sharmila Comments, YS Sharmila, YS Bharti,Kadapa, YSRCP, MP Candidate Avinash Reddy,Parliament,BJP, TDP, JANASENA, YCP, CONGRESS, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YS Sharmila, YS Bharti,Kadapa, YSRCP, MP candidate Avinash Reddy,Parliament,BJP, TDP, JANASENA, YCP, CONGRESS

ఏపీలో ఎన్నికల సమరం రోజురోజుకు ముదురుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటలు పదునెక్కుతున్నాయి. ప్రచారంలో స్పీడును పెంచిన అన్ని పార్టీల నేతలు, ప్రత్యర్దులకు సవాళ్లను విసురుతూ ఓటర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అన్ని పార్టీల నేతలు ఒక లెక్క.. వైఎస్ రాజశేఖర్ కుటుంబంలోని నేతలు ఒక లెక్క అన్నట్టుగా సాగుతోన్న రాజకీయాలపై ఏపీ వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

సింహం సింగిల్‌గా వస్తుందంటూ వైసీపీ నేతలంతా కూటమి అభ్యర్ధులను టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తుండగా.. వైఎస్సార్ బిడ్డను ఆదరించండని కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాత్రం  మొదటి నుంచి తన  జగన్ ‌అన్నను ఓ ఆట ఆడేసుకుంటూ ప్రచారంలో జోష్ ను పెంచుతున్నారు. సొంత చెల్లిని ఆదుకోవాల్సిన అన్నగా సీఎం జగన్..తన విధిని మర్చిపోతే అదే అస్త్రంగా మరల్చుకుని షర్మిల వైసీపీ నేతల తీరును ఎండగడుతోంది.

తాజాగా  సీఎం జగన్ సతీమణి.. వదినమ్మ  వైఎస్ భారతిపై  షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆమె ఎప్పటిలాగే వైసీపీపై విరుచుకుపడ్డారు. దానిలో భాగంగా..  ఎప్పుడూ సింగిల్ ప్లేయర్‌గా వాళ్లే అధికారంలో ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహమని అన్న షర్మిల.. గొడ్డలితో మిగిలిన వాళ్లనూ కూడా  నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్‌గా ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంతేకాదు ఓటమి భయంతో కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఊరు దాటడానికి  సిద్ధమయ్యారని షర్మిల ఆరోపించారు. ఏకంగా దేశం విడిచి వెళ్లడానికి అవినాష్ రెడ్డి పాస్ పోర్టులను కూడా సిద్ధం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో వైసీపీ ఓడితే అరెస్ట్ తప్పదని భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి కనుక ఈ ఎన్నికలలో ఎంపీగా గెలిస్తే నేరం గెలిచినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. కడపవాసులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఎంపీ కావాలంటే  నాకు ఓటేయండి అంటూ షర్మిల విజ్ఞప్తి చేశారు.దీంతో షర్మిల మాటలు రోజురోజుకు పదునెక్కుతున్నాయని..ఇది ఎంత లేదన్నా వైసీపీపై  ప్రతి కూల ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seven =