వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. విచారణలో జాప్యంపై మరోసారి తీవ్ర అసహనం

Supreme Court Angry with CBI For Delaying Inquiry in Ex Minister YS Vivekananda Reddy Assassination Case,Supreme Court Angry with CBI,Delaying Inquiry in Ex Minister Case,Delaying Inquiry in YS Viveka Assassination Case,Ex Minister YS Vivekananda Reddy Case,Mango News,Mango News Telugu,Supreme Court angry over delay,SC pulls up CBI for delay in Viveka murder,Viveka Murder Case,SC questions CBI over delay,Murder probe of YS Vivekananda,YS Vivekananda Reddy Latest News,YS Vivekananda Reddy Assassination Case Live News

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ కేసులో దర్యాప్తు సరిగా ముందుకు సాగటం లేదని, దీనికి బాధ్యులైన దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ ఇదే కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. ఈ హత్య రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదేనని రిపోర్ట్‌లో రాశారని పేర్కొన్న జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం.. వివేకా హత్యకు గల ప్రధాన కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయటపెట్టాలని కోరింది.

సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివామని, స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో రాజకీయ వైరం అని మాత్రమే రాశారని, విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని సీబీఐని నిలదీసింది. త్వరగా విచారణ పూర్తి చేయాలని, లేదంటే మరో అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న అధికారి రామ్ సింగ్‌ను కూడా కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇక మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని, సీబీఐ డైరక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =