రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, 6న ప్రధాని మోదీతో‌ భేటీ!

AP CM, AP CM YS Jagan, AP CM YS Jagan Mohan reddy, AP CM YS Jagan Will Go to Delhi, AP CM YS Jagan Will Go to Delhi Tomorrow, AP News, AP Political Updates, CM YS Jagan to visit Delhi tomorrow, YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అక్టోబర్ 5, సోమవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, అక్టోబర్ 6 తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో రెండుసార్లు భేటీ అయి, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పరిష్కారం కాని వివిధ సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈసారి పర్యటనలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సహా కీలక అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. అక్టోబర్ 5 న సీఎం వైఎస్ జగన్‌ ముందుగా పులివెందుల వెళ్లనున్నారు. అక్కడ తన మామ ఈసీ గంగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కడప నుంచి బయలుదేరి, రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu