తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయమని జోస్యం

YSRCP MP Vijaysai Reddy Sensational Comments, Vijayasai Reddy's Controversial Comments,YSRCP MP ,Vijaysai Reddy,collapse of the Congress government in Telangana, Rajya Sabha, Congress Party, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates, Mango News Telugu, Mango News
YSRCP MP Vijaysai Reddy Sensational Comments, Vijayasai Reddy's Controversial Comments,YSRCP MP ,Vijaysai Reddy,collapse of the Congress government in Telangana,

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారాన్ని రేపుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ తీవ్ర అన్యాయం చేసిందన్న విజయసాయి రెడ్డి.. రాష్ట్రాన్ని అన్యాయంగా రెండు ముక్కలుగా విభజించారంటూ రాజ్యసభ సాక్షిగా   కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా కూడా 10 ఏళ్లు అధికారం దక్కలేదని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు పదేళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ త్వరలోనే కూలడం ఖాయమంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుటుంబాలను చీల్చడం మొదటి నుంచీ కూడా కాంగ్రెస్‌కు అలవాటని విజయసాయి రెడ్డి విమర్శించారు. దేశంలో అతి త్వరలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతుందని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉనికి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని విజయసాయి గుర్తు చేశారు. 2029లో కూడా తాను ఎంపీగా ఉంటానని ధీమా వ్యక్తం చేసిన ఆయన..2029లో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ కూడా ఉండరని.. ఇది తన ఛాలెంజ్‌ అంటూ బహిరంగ సవాల్ చేశారు.

పార్లమెంట్లో విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయసాయి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది.. చర్చనీయాంశంగా మారింది. కాగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌  కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన  దగ్గర నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే విజయసాయిరెడ్డి రాజ్యసభ సాక్షిగా  తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటు గురించి ఇలా కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eighteen =