ఏప్రిల్ 1న గుంటూరులోని సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్

AP CM YS Jagan, AP CM YS Jagan will Take Corona Vaccine First Dose, AP CM YS Jagan will Take Corona Vaccine First Dose on April 1st, AP CM YS Jagan will Take Corona Vaccine First Dose on April 1st at Guntur, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, Guntur, Mango News, YS Jagan will Take Corona Vaccine, YS Jagan will Take Corona Vaccine First Dose

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కూడా కరోనా వ్యాక్సిన్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 1న గుంటూరులోని ఓ సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు.

ఏప్రిల్ 1 న తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం వైఎస్ జగన్ గుంటూరు చేరుకోనున్నారు. గుంటూరులోని భారత్‌పేట ఆరో లైన్‌లో గల 140వ వార్డు సచివాలయానికి చేరుకొని, అక్కడే రిజిస్ట్రేషన్‌ చేయించుకుని కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అరగంట పాటుగా సచివాలయంలోనే అబ్జర్వేషన్‌లో ఉండనున్నారు. అలాగే ఆ సమయంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సచివాలయ, వైద్య సిబ్బందితో సమావేశమై కీలక సూచనలు చేయనున్నారు. గుంటూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ