ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.ఎస్ జవహర్ రెడ్డికి టీటీటీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగింత
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావు నియామకం
- క్రీడలు, యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్
- కమర్షియల్ ట్యాక్స్ శాఖ కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా
- విద్యాశాఖ కమిషనర్‌గా ఎస్.సురేష్ కుమార్
- గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా వి.చిన వీరభద్రుడు
- సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీగా పి.రంజిత్ బాషా
- చేనేత సంక్షేమశాఖ సంచాలకులుగా సి.నాగమణి
- బీసీ సంక్షేమశాఖ సంచాలకులుగా పి.అర్జున్‌రావు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ