ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రస్తుత డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసింది. ఆయనను సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. గౌతమ్ సవాంగ్ స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తునట్టు పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా కొనసాగనున్నారని తెలిపారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డా.సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ