కుమారుడి జన్మదినం సందర్భంగా.. టీటీడీకి రూ.33 లక్షలు విరాళం అందించిన నారా లోకేష్-బ్రాహ్మణి దంపతులు

Nara Lokesh and His Wife Brahmani Donated Rs.33 Lakhs To TTD on The Occasion of Their Son Devansh's Birthday,Nara Lokesh and His Wife Brahmani Donated Rs.33 Lakhs,Donated Rs.33 Lakhs To TTD on Devansh's Birthday,Nara Lokesh Donated Rs.33 Lakhs To TTD,Nara Lokesh on Devansh's Birthday,Mango News,Mango News Telugu,Nara Devansh's Birthday,Nara Devansh Birthday,Nara Lokesh Donates 33 Lakhs,Nara Devansh Birthday Latest News,Nara Devansh Birthday Live News,TDP General Secretary Nara Lokesh,TTD Latest News,TTD Live Updates

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు బ్రాహ్మణి దంపతులు మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి విరాళం అందజేశారు. కుమారుడు నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా వారు రూ.33 లక్షల విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమం కోసం ఒకరోజుకు సరిపడా ఖర్చును, అంటే రూ.33 లక్షల భారీ విరాళాన్ని అందించారు నారా లోకేష్ దంపతులు. ఈ మేరకు టీటీడీ శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లోని డిజిటల్ బోర్డుల్లో ప్రదర్శించడం విశేషం. అలాగే మరోవైపు దేవాన్ష్ పేరున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు రాష్ట్రమంతటా అన్నదానం చేస్తున్నారు. కాగా ప్రతి సంవత్సరం నారా లోకేష్-బ్రాహ్మణి దంపతులు తమ కుమారుడి పుట్టినరోజును పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణకు విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − eight =