ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh, Andhra Pradesh State Election Commission, AP Coronavirus, AP High Court, AP High Court Gives Green Signal To ZPTC MPTC Elections, AP MPTC, AP MPTC Elections, ap mptc zptc elections, AP MPTC ZPTC Elections 2021, AP ZPTC, AP ZPTC Elections, Mango News, MPTC and ZPTC Elections, MPTC ZPTC Elections, MPTC ZPTC Elections Polling, YS Jagan Mohan Reddy, ZPTC and MPTC elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత తొలగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పక్రియను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కౌంటింగ్‌ పక్రియను నిలిపివేయాల్సిందిగా ఎస్ఈసీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యధాతధంగా జరగనున్నాయి.

ముందుగా ఈ ఎన్నికల నిర్వహణపై టీడీపీ సహా పలు పార్టీలు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశాయి. విచారణ అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పక్రియను నిలిపివేస్తూ మంగళవారం నాడు ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఎన్నికలు జరిపేలా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికలసంఘం కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం నాడు డివిజన్ బెంచ్ ముందు వాదనలు ముగిసిన అనంతరం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =