ఏపీ బీజేపీకి షాక్. బీజేపీ సభ్యత్వానికి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు రావెల తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే రావెల గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్లు ఉంటున్నారని,ఎప్పుడైనా పార్టీ వీడొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ.. ఆయన బీజేపీకి రాజీనామా చేయడం విశేషం. అయితే పార్టీలో చేరాక తనకు సముచిత స్థానం కల్పించారని.. అందుకు కృతజ్ఞతలు అని రావెల తన లేఖలో వెల్లడించారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రావెల ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ టికెట్‌పై పోటీ చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఓటమి చెందారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ