కూల్ అవుతున్న టీడీపీ అసంతృప్త నేతలు

Babu, TDP senior leaders,Alapati Rajendraprasad, Ganta Srinivasa Rao, Devineni Uma, Peela Govind, Boddu Venkata Ramana,chandrababu naidu,Tenali,janasena,pawan kalyan,AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Babu, TDP senior leaders,Alapati Rajendraprasad, Ganta Srinivasa Rao, Devineni Uma, Peela Govind, Boddu Venkata Ramana

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను టీడీపీ అధినేత  చంద్రబాబు బుజ్జగించే పనిలో పడ్డారు.   ఎప్పుడయితే టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా రిలీజయిందో అప్పటి నుంచీ రెండు పార్టీలలో అసంతృప్త రాగాలు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రకటించిన 94 మంది అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేదని చాలామంది సీనియర్లు అసంతృప్తికి లోనయ్యారు.

పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించగా..అందులో ఐదుగురి అభ్యర్థిత్వం  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఈ 99 స్థానాల్లో సీటు కోసం పోటీ పడిన ఆశావహులతో పాటు, జనసేన పార్టీకి  కేటాయించిన నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ సీనియర్లను ఇప్పుడు చంద్రబాబు పిలిచి మాట్లాడుతున్నారు.

వారి రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు భరోసా కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పదవి ఇస్తామంటూ వారికి ఆఫర్ చేస్తున్నారు. దీంతో మెత్తబడుతున్న కొంతమంది సీనియర్లు అభ్యర్థులకు సహకరిస్తామని టీడీపీ అధినేతకు హామీ ఇస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన వెలువడిన తర్వాత చాలా మంది తెలుగు తమ్ముళ్లు అసంతృప్తికి గురయి.. కొంతమంది అజ్ఙాతంలోకి కూడా వెళ్లిపోయారు. అటువంటి కీలక నాయకులందరితో  ఇప్పుడు చంద్రబాబు టచ్ లోకి వెళుతున్నారు.

ఇలా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్,  గంటా శ్రీనివాసరావు , దేవినేని ఉమా, పీలా గోవింద్, బొడ్డు వెంకట రమణ వంటి సీనియర్ నేతలను  పిలిచి వారితో మాట్లాడారు. జనసేనతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లు తప్పవని..  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపులకు సీనియర్లంతా సహృదయంతో సహకరించాలని బాబు కోరారట. అంతేకాదు..వారికి అధికారం రాగానే  సముచిత స్థానం కల్పిస్తానంటూ  హామీ ఇచ్చారట.

టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ టికెట్ ను జనసేనకు కేటాయించారు. ఇక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అసంతృప్తికి లోనవడంతో ఆయన్ను చంద్రబాబుని పిలిచి మాట్లాడారు. చంద్రబాబు తర్వాత లోకేశ్ తో  కూడా ఆయన భేటీ అయ్యారు. వీరిద్దరితో భేటీ అనంతరం పొత్తుల సమీకరణాలను తాను అర్థం చేసుకుంటానని రాజేంద్రప్రసాద్ మీడియా ముందు చెప్పారు

పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేన పార్టీకి  కేటాయించగా.. అక్కడ తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పీలా గోవింద్.. అయ్యన్నపాత్రుడితో కలిసి చంద్రబాబును కలిశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పీలా గోవింద్‌కు గౌరవ ప్రదమైన పదవి ఇస్తామని  చెప్పారు. అలాగే రాజానగరం తెలుగు దేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణకు రాజమండ్రి ఎంపీ లేదా వేరే పెద్ద పదవి కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కూడా మెత్తబడ్డారట. మైలవరం టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు కూడా ప్రత్యామ్నాయ సీటు ఇస్తామని చెప్పడంతో..ఉమ కూడా  సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =