ఏపీలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం, వివరాలు వెల్లడించిన సజ్జల రామకృష్ణారెడ్డి

Andhra Pradesh, AP, AP Corporations, AP Corporations Chairman Reservation, AP Govt Appointed 481 Directors for 47 Corporations, AP Govt Appointed 481 Directors for 47 Corporations in the State, AP govt appoints 481 directors to 47 Corporations, AP News, Appointment Of 481 Directors To 47 Corporations, Govt Appointed 481 Directors for 47 Corporations, Govt Appointed 481 Directors for 47 Corporations In AP, Mango News

రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఊసే లేదని అన్నారు. రాజ్యసభ సీటు విషయంలో చంద్రబాబు ఎస్సీలను అవమానించారన్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆయన ఓటు బ్యాంక్‌గానే చూశారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. కార్పొరేషన్ల స్థాయిలో సామాజిక న్యాయం అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామని అన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామని, ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. రాష్ట్రంలో బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం వైఎస్ జగన్‌ లక్ష్యమని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ