టోక్యో పారాలింపిక్స్ : బాడ్మింటన్ లో ప్రమోద్‌ భగత్‌ కు స్వర్ణం, మనోజ్‌ సర్కార్‌ కు కాంస్యం

Tokyo Paralympics : Pramod Bhagat Wins Gold, Manoj Sarkar Wins Bronze Medal in Badminton SL3 Category

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. శనివారం సాయంత్రం బాడ్మింటన్ లో ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-3 కేటగిరి ఫైనల్లో గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌ ను 21-11 21-16 తేడాతో ప్రమోద్‌ భగత్‌ ఓడించి భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతాకాన్ని చేర్చాడు. పారాలింపిక్స్‌ చరిత్రలో బ్యాడ్మింటన్‌ లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా ప్రమోద్‌ భగత్‌ రికార్డ్ సృష్టించాడు. అలాగే ఎస్‌ఎల్‌-3 కేటగిరిలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత క్రీడాకారుడు మనోజ్‌ సర్కార్‌ జపాన్‌కు చెందిన పుజిహారాను 22-20, 21-13 తేడాతో ఓడించి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు.

మరోవైపు శనివారం ఉదయం జరిగిన షూటింగ్ (మిక్సిడ్ 50m పిస్టోల్ SH1) ఫైనల్ లో మనీష్ నర్వాల్ స్వర్ణ పతకం సాధించగా, సింఘ్ రాజ్ అదానా రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పారాలింపిక్స్-2020లో భారత్ పతకాల సంఖ్య 17 కు (నాలుగు స్వర్ణం, ఏడు రజతం, ఆరు కాంస్యాలు) చేరుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eight =