వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh, AP Govt Gives Green Signal to Recruit 9712 Vacant Posts, AP Health Department, AP Health Department Vacant Posts, AP Health Department Vacant Posts Recruitment, AP News, Recruit 9712 Vacant Posts in Health Department, Vacant Posts in AP Health Department

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వైద్య వ్యవస్థలో సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్‌ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి జూన్ 11, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాల్లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, లాబ్ టెక్నిషియన్లు, ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 4131, ఏపీవీవీపీ పరిధిలో 2414, డీపీహెచ్ పరిధిలో 3167 పోస్టులు భర్తీ కానున్నాయి. కాగా 2153 పోస్టులను రెగ్యులర్ గా, 5574 పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో మరియు 1985 పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu