చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసింది.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వెల్లడి

TDP Denies Buying of Pegasus Spyware in Their Government, TDP Denies Buying of Pegasus Spyware, Andhra Pradesh, Buying of Pegasus Spyware, Pegasus Spyware, CM Mamata Banerjee, Mamata Banerjee, Chief Minister of West Bengal, West Bengal CM Mamata Banerjee, Pegasus Spyware Latest News, Pegasus Spyware Latest Updates, Pegasus Spyware Live Updates, Pegasus, Mango News, Mango News Telugu,

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాటలతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం మొదలయింది. అయితే, పెగాసెస్ కొనుగోలును తెలుగుదేశం పార్టీ ఖండించింది. ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు స్పందించారు. తమ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా దీనిపై స్పందించారు. ‘‘నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా మాజీ డీజీపీ సవాంగ్ గారే చెప్పారు. సమాచార హక్కు చట్టం ప్రకారం కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి 25-7-21వ తేదీన అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. అసలు అలాంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డీజీపీ సవాంగ్ 12-8-21వ తేదీన సమాధానం ఇచ్చారు’’ అంటూ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.

కాగా, నాలుగైదేళ్ల క్రితం పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని, అయితే ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైంది అయినందున తాము కొనలేదని వెల్లడించారు. కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసిందని మమత వెల్లడించారు. అదేసమయంలో ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిన కేంద్రం ప్రభుత్వం, దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్షనేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 12 =