5 వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు రద్దు చేస్తూ నిర్ణయం

#Karnataka, Karnataka bans online classes, Karnataka bans online classes till 5th standard, Karnataka goverment, Karnataka Govt, Karnataka Latest News, Karnataka News, Karnataka Stop Online Classes upto 5th Standard, Online Classes upto 5th Standard, Stop All Online Classes upto 5th Standard

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, ఇతర విద్యా సంస్థలన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. కాగా పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అన్ని విద్యా సంస్థలకు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ తరగతులను రద్దుచేస్తూ కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రాధమిక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ ప్రకటన చేశారు. అలాగే కొద్ది మంది కేబినెట్ మంత్రులు ఏడో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు రద్దు చేయాలనీ సూచించారని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా రికార్డింగ్‌ చేసిన వీడియోల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eighteen =