ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు దీనికి సంబంధించి శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. 2023-24 విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు సెమిస్టర్ల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ముందుగా 1వ తరగతి నుండి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్ల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక 2024-2025 విద్యా సంవత్సరం నుండి 10వ తరగతికి కూడా దీనిని వర్తింప చేయనున్నారు. ఈ క్రమంలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు సరిపడా పుస్తకాలను ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా పంపిణీ చేయనున్నారు. కాగా సీఎం జగన్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన మరియు సులభతరమైన బోధన కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ