ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై బియ్యం కార్డులనే ఆదాయ సర్టిఫికెట్స్ గా పరిగణన

AP Breaking News, AP Govt, AP Income Certificates, AP News, AP Ration Cards, AP to Treat Ration Cards As Income Certificates, Income Certificates, Ration Cards, Ration Cards As Income Certificates, Ration Cards As Income Certificates In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై బీపీఎల్ కుటుంబాలకు ఇచ్చే బియ్యం కార్డులను(తెల్ల రేషన్ కార్డు) ఆ కుటుంబం యొక్క ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని నిర్ణయించారు. ఈ మేరకు జూలై 25, శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పాటించాలని రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్లు, ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. మరోవైపు ఇతర కుటుంబాలకు జారీ చేసే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కాలపరిమితిని 4 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu