ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులతో మాట్లాడి, ధైర్యం చెప్పిన చంద్రబాబు

Ukraine Tension Chandrababu Naidu Speak With Stranded Telugu Students, Ukraine Tension, Chandrababu Naidu Speak With Stranded Telugu Students, Chandrababu Naidu, Stranded Telugu Students, Nara Chandrababu Naidu, Telugu Desam Party, Telugu Desam Party leader, Telugu Desam Party leader Nara Chandrababu Naidu, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Mango News, Mango News Telugu,

రష్యా దాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులలో ఉక్రెయిన్‌లోని తెలుగు వారు తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కడి విద్యార్థులతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. రాబోయే రెండు రోజులు ఎంతో ముఖ్యమని, పూర్తి అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు. ఈ పరిస్థితుల్లో పాస్‌పోర్ట్ సహా ఇతర వ్యక్తిగత ఆధారాలు, గుర్తింపు ధ్రువ పత్రాలు చాలా కీలకమని, వాటిని ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలని బాబు సూచించారు.

అలాగే, ఈ సమయంలో తెలుగు విద్యార్థులంతా ఒక్కటిగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుందని, మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుందని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వారందరికీ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ ఆడుకోవటానికి ముందుకొచ్చింది. చిక్కుకుపోయిన వారికి సహాయం చేయడానికి ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు నారా లోకేష్‌ తెలిపారు.

NRI TDP హెల్ప్ లైన్ నెంబర్స్ 
  • సెల్ హాట్‌లైన్: +91 8645350888
  • WhatsApp: +91 8950674837
  • ఈమెయిల్: [email protected]
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =