ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ

AP Govt Orders To Increase Stipend For The Junior Doctors, AP Government, AP Govt Orders, AP Govt Orders To Increase Junior Doctors Stipend, Mango News, Mango News Telugu, Andhra Pradesh Hikes Stipend, 15% Stipend Hike For Junior Doctors, Junior Doctors Demand Stipend Hike, Ap Junior Doctors Stipend Hike, Andhra Pradesh Junior Doctors, AP Juda, AP Junior Doctors Association, AP CM YS Jagan Mohan Reddy, Junior Doctors Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లకు శుభవార్త వినిపించింది. ఎప్పటినుంచో వారు డిమాండ్ చేస్తున్న ఉపకార వేతనం (స్టైఫండ్) పెంచింది. ఈ మేరకు శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. చదువుతున్న ఏడాదిని బట్టి స్టైఫండ్‌ పెంపుదల చేస్తున్నట్లు, అలాగే అన్ని కేటగిరీల్లో 15శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామంటూ జూనియర్ డాక్టర్ల హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం.. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటర్నీల్‌కు స్టైఫండ్ రూ.22,527 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే పీజీ డాక్టర్లకు మొదటి సంవత్సరం వారికి రూ.50,686, రెండవ సంవత్సరం వారికి రూ.53,503, రూ.మూడవ సంవత్సరం వారికి రూ.56,319లు పెరిగాయి. ఇక పీజీ డిప్లమా వారికి కూడా అదే విధంగా పెరిగింది. సూపర్ స్పెషాలిటీ డాక్టర్‌లకు స్టై ఫండ్ గా మొదటి సంవత్సరం రూ.56,309, రెండో సంవత్సరం రూ.59,135, మూడవ సంవత్సరం రూ.61,949స్టై ఫండ్ పెంచారు. వీరితో పాటు ఎండీఎస్ కోర్సు చేసే వారికి మొదటి సంవత్సరం రూ.56,686, రెండో సంవత్సరం వారికి రూ.53,503, మూడవ సంవత్సరం వారికి రూ.56,519 పెరిగింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY