యువగళం పాదయాత్రకు 100 రోజులు.. లోకేష్‌తో కలిసి నడిచిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు

Nara and Nandamuri Family Members Joins Lokeshs Yuvagalam Padayatra as it Completes 100 Days Today,Lokeshs Yuvagalam Padayatra,Nara and Nandamuri Family Members Joins Yuvagalam Padayatra,Lokeshs Yuvagalam Padayatra as it Completes 100 Days,Lokeshs Yuvagalam Padayatra as it Completes 100 Days Today,Mango News,Mango News Telugu,Nara Bhuvaneswari joins Lokesh's Yuvagalam Padayatra,Yuvagalam Padayatra,Yuvagalam Padayatra Latest News And Updates,Yuvagalam Padayatra Reached To 100 Days,Nara Lokesh Latest News And Updates

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర, రాయలసీమ జిల్లాల మీదుగా.. ప్రస్తుతం శ్రీశైలంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్‌ను కలిసి అభినందించారు. అలాగే ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. తల్లి భువనేశ్వరి మరియు భార్య బ్రాహ్మణి సహా పలువురు కుటుంబ సభ్యులు సోమవారం బోయరేవుల నుంచి ప్రారంభమైన పాదయాత్రలో నారా లోకేష్‌తో కలిసి నడిచారు. ఈరోజు ముత్తుకూరు, పెద్ద దేవళాపురం, సంతజూటూరు, పరమటూరు మీదుగా బండి ఆత్మకూరు వరకు పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలో సంత జూటూరులో చెంచులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు.

ఇక యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జై లోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో మిన్నంటిన ఉత్సాహంతో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. మరోవైపు లోకేష్ యువగళం యాత్రకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు పాదయాత్రలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3 వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచే అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సంఘీభావ యాత్రను ప్రారంభించారు. ఇక తన పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. నారా లోకేష్ నేడు శ్రీశైలం నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక పైలాన్ ను ఆవిష్కరించనున్నట్లు కూడా టీడీపీ వర్గాలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =