తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలు విడుదల

Telangana TSLPRB Releases SI and Constable Preliminary Exam Results, Telangana State Level Police Recruitment Board, TSLPRB Results, TSLPRB Releases Exam Results, Mango News, Mango News Telugu, SI Constable Preliminary Exam Results Released, TSLPRB Results 2022, TSLPRB Constable Result 2022, TSLPRB SI Result 2022 Released, TSLPRB SI Result, TSLPRB SI Result Online, TSLPRB Police Result 2022, TSLPRB Results

తెలంగాణ రాష్ట్రంలో 554 ఎస్సై పోస్టులకు ఆగస్టు 7వ తేదీన, 15,644 పోలీస్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఆగస్టు 28వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్‌ఎల్‌పీఆర్బీ శుక్రవారం ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.

సివిల్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం మంది, సివిల్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 31.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అలాగే ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌ పరీక్షలో 44.80 శాతం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో 43.65 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 2,25,668 మంది అభ్యర్థులు ఎస్సై రాత పరీక్షకు హాజరుకాగా 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 అభ్యర్థులు హాజరుకాగా 1,84,861 (31.39 శాతం), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890లో 1,09,518 (43.65 శాతం), ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు 41,835 లో 18,758 (44.84 శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు టీఎస్‌ఎల్‌పీఆర్బీ ప్రకటించింది.

ఇటీవలే సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హతకై నిర్ణయించిన కటాఫ్‌ మార్కులపై జీవోను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం మేరకు కొన్ని కేటగిరీల అభ్యర్థుల ప్రిలిమినరీ రాత పరీక్ష క్వాలిఫైయింగ్ మార్కులకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ సవరించింది. ప్రిలిమినరీ రాత పరీక్ష పేపర్‌లో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందాల్సిన కనీస మార్కులు ఓసీలకు 30 శాతం, బీసీలకు 25 శాతం మరియు ఎస్సీలు/ఎస్టీలు/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ లకు 20 శాతంగా నిర్ణయించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు నిర్వహించగా ఓసీ అభ్యర్థులు 60 మార్కులు, బీసీ అభ్యర్థులు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 40 మార్కులు పొందితే అర్హత సాధించగలరని పేర్కొన్నారు. కటాఫ్ మార్కులపై కూడా ప్రకటన వెలువడడంతో తాజాగా ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌ఎల్‌పీఆర్బీ విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 1 =