ఆంధప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ఆగస్టు 24, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్నపేదలకు నాణ్యమైన సోర్టెక్స్ బియ్యాన్ని ఇంటివద్దనే పంపిణీ చేయనున్నారు. ఇంటివద్దకే డెలివరీ ఇవ్వడం కోసం 9,260 మినీ ట్రక్కులు కొనుగోలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక వాహనాలను నిరుద్యోగ యువతకు సబ్సిడీపై ఇవ్వనున్నారు. అలాగే వాహనాల కేటాయింపులో బీసీ, ఎస్సి, ఎస్టి, ఈబీసీ, మైనార్టీల రిజర్వేషన్ ను పక్కగా అమలు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu